|  
FLASH NEWS
Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  •  జాతీయ స్థాయి నృత్యోత్సవంలో హైదరాబాద్ విద్యార్థినుల సత్తా.. పతకాల పంట పండించిన కందుల నాట్యాలయ బృందం  •  నా చావు కోరుతూ సభకు రమ్మంటున్నారు : రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం  • 
Skip to content

అసెంబ్లీ ముట్టడికి ముందే టెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతల ముందస్తు అరెస్టులు

assembly protest bjp bjym arrests
assembly protest bjp bjym arrests

హైదరాబాద్, సూర్య న్యూస్ : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఆందోళన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరు కాకుండా అడ్డుకునేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం (BJYM) నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాల్లోని ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, నల్గొండ జిల్లా చండూరు తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకే పరిమితం చేశారు.

విద్యార్థుల పక్షాన శాంతియుతంగా పోరాడుతున్న తమ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం పోలీసుల సాయంతో తమ గొంతు నొక్కాలని చూస్తోందని వారు ఆరోపించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ నిధులను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp