
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వర్షాకాల సమావేశాల తొలిరోజు సభా ప్రాంగణం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. లోపలికి వెళ్తున్న సమయంలో పోలీసులు తన చీర లాగారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళల పట్ల పోలీసులు ఈ విధంగానే వ్యవహరిస్తారా అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తోటి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. అదే సమయంలో నిరసన తెలుపుతూ నల్ల టీషర్టులు ధరించి సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ప్రతిపక్ష నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఆందోళనల మధ్య ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాలికి గాయమైందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
అసెంబ్లీ వద్ద జరిగిన ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఘటనపై ఇంతకుఇంత చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశాల మొదటి రోజే చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



