
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement), స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి (Assembly Mutadi) కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం
రాష్ట్రంలో సుమారు పదకొండు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాలు మరియు ఇతర సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉంటున్నాయని, కానీ విద్యార్థుల చదువుల కోసం మాత్రం నిధులు లేవని చెప్పడం శోచనీయం అని ఆరోపించారు. విద్యార్థులు వసతిగృహాల్లో బాస్మతి బియ్యంతో భోజనం, ఏసీ గదులు అడగడం లేదని, కనీస నాణ్యమైన భోజనం మరియు పక్కా భవనాలు మాత్రమే కోరుతున్నారని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న పదకొండు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తక్షణమే సానుకూల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



