|  
FLASH NEWS
HYDRA Toll Free Number : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. అత్యవసర సేవల కోసం హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!  •  AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!  •  TGPSC Notification Cancelled : నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ 544 పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ కీలక ప్రకటన!  •  Modi Gifts Putin : రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి.. పుతిన్‌ను ఆకర్షించిన ఆ అరుదైన పుస్తకం ఏమిటంటే?  •  Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  • 
Skip to content

Telangana Assembly Mutadi : 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement), స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి (Assembly Mutadi) కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం

రాష్ట్రంలో సుమారు పదకొండు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాలు మరియు ఇతర సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉంటున్నాయని, కానీ విద్యార్థుల చదువుల కోసం మాత్రం నిధులు లేవని చెప్పడం శోచనీయం అని ఆరోపించారు. విద్యార్థులు వసతిగృహాల్లో బాస్మతి బియ్యంతో భోజనం, ఏసీ గదులు అడగడం లేదని, కనీస నాణ్యమైన భోజనం మరియు పక్కా భవనాలు మాత్రమే కోరుతున్నారని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న పదకొండు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తక్షణమే సానుకూల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp