రిపోర్టర్: Raju

హైదరాబాద్, సూర్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న వర్సిటీ స్నాతకోత్సవ సన్నాహాల గురించి వివరించి, ఈ వేడుకకు గవర్నర్‌ను ఆహ్వానించడంతో పాటు ఆయన సలహాలు సూచనలు కోరారు. అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిన ఈ భేటీ పట్ల ప్రొఫెసర్ చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్ వినియోగంపై గవర్నర్‌కు వీసీ వివరించారు. వర్సిటీని పూర్తిగా ఆన్‌లైన్ విద్యావిధానం దిశగా తీసుకెళ్లడం, కొత్త ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టడం, క్యాంపస్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



