|  
FLASH NEWS
Women’s Asia Cup 2026 : శ్రీలంకపై ప్రతీకారం.. ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా టీమిండియా  •  Konda Surekha : ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దల కబురు.. కొండా సురేఖకు మరో కీలక పదవి గ్యారెంటీనా?  •  BRICS Summit 2026 : భారత్‌లో బ్రిక్స్ సదస్సు సక్సెస్.. ప్రధాని మోదీ దౌత్యంపై విదేశీ మీడియా ప్రశంసలు  •  China Ocean Minerals : పసిఫిక్ సముద్ర గర్భంలో అపారమైన బంగారం, వెండి నిక్షేపాలు.. చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు  •  Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం  • 
Skip to content

Konda Surekha : ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దల కబురు.. కొండా సురేఖకు మరో కీలక పదవి గ్యారెంటీనా?

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్ర కేబినెట్ నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురైన సీనియర్ నాయకురాలు కొండా సురేఖ (Konda Surekha) మళ్లీ ఢిల్లీ బాట పట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం (Congress High Command) నుంచి ఆమెకు అత్యవసర పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆమెకు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించబోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ ముఖ్య అనుచరులతో హన్మకొండలో అత్యవసరంగా భేటీ కానున్నారు. తమకు ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన పిలుపు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో అనుచరుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే తమకు ఓ కీలక పదవి ఖాయమైందని కొండా మురళి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో ఈ భేటీ పూర్తయిన వెంటనే సురేఖ ఢిల్లీకి బయలుదేరనున్నారు.

హైకమాండ్ వ్యూహంపై ఉత్కంఠ

మంత్రి పదవి నుంచి ఆమెను తొలగించినప్పటికీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఉన్న బలమైన క్యాడర్, వారి ప్రాబల్యాన్ని పరిగణనలోకి తీసుకునే ఏఐసీసీ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సురేఖను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp