|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Salman Khan Viral Video : వినాయకుడికి హారతి పట్టిన సల్మాన్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ముంబై, సూర్య న్యూస్ : బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణేశ్ నిమజ్జనం (Ganesh Visarjan) వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా పాల్గొన్నారు. ఖాన్ కుటుంబం ఒకటిన్నర రోజుల పాటు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. సల్మాన్ స్వయంగా స్వామివారికి హారతి పట్టారు. భక్తిశ్రద్ధలతో ఆయన హారతి ఇస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

ఖాన్ కుటుంబం దశాబ్దాలుగా ముంబైలో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. సల్మాన్ తల్లి సల్మా ఖాన్ అసలు పేరు సుశీల చరక్ కాగా, ఆమె మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ పండుగ ఆచారాలు వారి ఇంట చిన్నప్పటి నుంచే కొనసాగుతున్నాయి. బాల్యంలో సల్మాన్ తన తోబుట్టువులు అర్బాజ్, సోహైల్, అల్విరాలతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లి గణనాథుడి పూజలు, ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలో ఇంటి ముందు ఆగే మెరవణిలో చేరి హారతి ఇవ్వడం, నృత్యాలు చేయడం వంటివి చేసేవారు. కాలక్రమేణా బాంద్రాలోని తమ సొంత నివాసంలోనూ వారు ఈ వేడుకలను కొనసాగించారు.

అర్పితా ఖాన్ కోరికతో మొదలైన సంప్రదాయం

తమ సొంత ఇంట్లో గణపతిని ప్రతిష్టించే సంప్రదాయం సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ కోరిక మేరకు ప్రారంభమైంది. అప్పటినుంచి అది వారి కుటుంబ వార్షిక ఆచారంగా స్థిరపడిపోయింది. ప్రతి ఏడాదీ వినాయక ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు కుటుంబ సభ్యులంతా ఒకేచోట చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు. గతంలో నిమజ్జన వేడుకల్లో సల్మాన్ ఉత్సాహంగా నృత్యం చేసిన దృశ్యాలు కూడా అభిమానులను ఎంతగానో అలరించాయి. తాజాగా సోహైల్ ఇంట్లో జరిగిన వేడుకల్లో భాయ్ జాన్ స్వయంగా హారతి పట్టిన వీడియో వైరల్‌గా మారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

134275462
Pic source : TOI
134275463
salman ganpati visarjan
source : PIC by TOI

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp