|  
FLASH NEWS
Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  • 
Skip to content

Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

​ముంబై, సూర్య న్యూస్ :​ బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) మృతి కేసులో ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే (Aaditya Thackeray) కు దిశా తండ్రి ఏకంగా ఐదొందల కోట్ల రూపాయల భారీ లీగల్ నోటీసులు పంపారు.

ఈ కేసుకు సంబంధించి ఆదిత్య థాక్రేతో పాటు రాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు కూడా దిశా తండ్రి నోటీసులు జారీ చేశారు. తనకు ఈ భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకేసారి మాజీ సీఎం కుమారుడికి, అలాగే మాజీ హోంమంత్రికి నోటీసులు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ అనూహ్య పరిణామంపై ఆదిత్య థాక్రే వెంటనే స్పందించారు. దిశా సాలియన్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా నోటీసుల వ్యవహారంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఈ పాత కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp