
కాకినాడ, సూర్య న్యూస్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ‘ఆశీర్వాద్ కా దియా’ (Aashirwad Ka Diya) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజాసేవలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధానికి కృతజ్ఞతగా స్థానిక నాయకులు దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్.ఎన్.పట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎం. వరహాలబాబు తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి దీపం వెలిగించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి మోదీ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అభిమానులు పాల్గొని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



