|  
FLASH NEWS
IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  •  AP Minister Nara Lokesh : వినాయక నిమజ్జనాలకు డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి  •  Breaking News : 30 బంతుల్లోనే అభిషేక్ శర్మ సంచలన సెంచరీ  •  Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  • 
Skip to content

Telangana Liberation Day : నిజాం పాలన నుంచి విముక్తి… రైతాంగ పోరాటాలు, ఆపరేషన్ పోలో, విలీనం వెనుక ఉన్న పూర్తి చరిత్ర

Telangana Liberation day
Telangana Liberation day

హైదరాబాద్, సూర్య న్యూస్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ సంస్థానం (Hyderabad State) ఇండియన్ యూనియన్ లో విలీనమైన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17, 1948. నాటి నిజాం పాలన (Nizam Rule), రజాకారుల (Razakars) హింస నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) నిర్ణయంతో చేపట్టిన ఆపరేషన్ పోలో (Operation Polo) ద్వారా ఈ విమోచన దినోత్సవం (Liberation Day) సాకారమైంది.

1001080489
Meer usman ali khan

నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచుకునే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వంతో 1947 నవంబర్ లో యథాతథ ఒప్పందం (స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి గ్రామాలపై పడి ప్రజలను తీవ్రంగా హింసించారు. ఆస్తుల దోపిడీలు, మహిళలపై అకృత్యాలు, పన్నుల భారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Operation POLO
Pics credit : Cummons Wikimedia

​ఈ అరాచకాలను ఎదిరించేందుకు కేవలం జాతీయవాదులే కాకుండా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతు పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రైతులు, సామాన్యులు ఆయుధాలు పట్టి భూస్వాములు, నిజాం సైన్యంపై స్వతంత్రంగా వీరోచిత పోరాటం చేశారు. చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి ఎందరో యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ చారిత్రక ఉద్యమంలో భూమికను పోషించారు.

హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో నాటి హోం మంత్రి పటేల్ ఆదేశాలతో భారత ప్రభుత్వం సైనిక చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబర్ 13న భారత సైన్యం జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ ను చుట్టుముట్టింది. ఈ సైనిక చర్య తో సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం నవాబు రేడియోలో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశాడు. ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 18న నిజాం సైన్యాధికారి ఎల్ ఎడ్రూస్ భారత సైన్యం ముందు అధికారికంగా లొంగిపోవడంతో విలీన ప్రక్రియ లాంఛనంగా పూర్తయింది.

అయితే ఆపరేషన్ పోలో తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానంలో కొన్ని విషాదకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విలీనం అనంతరం జరిగిన అల్లర్లలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పండిట్ నెహ్రూ నియమించిన సుందర్ లాల్ కమిటీ నివేదిక చరిత్రలో ఒక చీకటి కోణాన్ని నమోదు చేసింది. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, కాంగ్రెస్ నాయకుల వ్యూహాలు, ఆపరేషన్ పోలో మరియు సాధారణ ప్రజల త్యాగాల కలయికే నేటి స్వేచ్ఛా తెలంగాణకు అసలైన పునాది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp