
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) మహిళల నెలసరి సమస్యలపై చేసిన తాజా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ (Periods) రావాలని తాను ప్రార్థించానని ఆమె ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒకవేళ పురుషులకు కూడా ఈ పరిస్థితి వస్తే పని ప్రదేశాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
మగవాళ్లకు కూడా ఈ సమస్య ఉంటే, సినిమా కాంట్రాక్టుల్లోనే పీరియడ్ హాలిడేస్ గురించి స్పష్టంగా నిబంధనలు రాస్తారని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. కెరీర్ మొదట్లో తాను కూడా షూటింగ్ సెట్స్‌లో నెలసరి ఇబ్బందుల గురించి బహిరంగంగా చెప్పలేకపోయేదాన్ని అని ఆమె తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఒక సంఘటన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె వివరించారు.
గతంలో తన కో-స్టార్ ఒకరికి మోకాలికి సర్జరీ జరిగిందని, ఆ సమయంలో మూవీ టీమ్ అంతా ఆయనకు అనుగుణంగానే తమ పని వేళలను మార్చుకుని పనిచేశారని శ్రుతి హాసన్ వెల్లడించారు. ఆ ఘటన చూసిన తర్వాత, మహిళల ఆరోగ్య సమస్యలను కూడా అలాగే ఎందుకు అర్థం చేసుకోకూడదనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. అప్పటినుంచి షూటింగ్ సెట్స్‌లో తన నెలసరి సమస్యల గురించి సినిమా బృందానికి ఎలాంటి మొహమాటం లేకుండా ధైర్యంగా చెబుతున్నానని ఆమె స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య సమస్యలపై ఆమె చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



