|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

Adilabad Airport : ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ (Adilabad Airport) నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. రక్షణ, పౌర విమానయాన శాఖలు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు ఈ అధికారులు కీలకంగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.

రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలతో నిరంతరం జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో సంబంధిత సంస్థల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

అత్యాధునిక సదుపాయాలతో ఎయిర్ పోర్ట్ నిర్మాణం

ఈ ప్రాజెక్టులో భాగంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ డిస్పర్సల్స్, షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషనల్ కాంప్లెక్స్, శిక్షణ కార్యక్రమాలు, మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సౌకర్యాలను సైతం అభివృద్ధి చేయనున్నారు. పౌర విమానయానానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సివిల్ టెర్మినల్, విమానాల మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ సదుపాయం ఏర్పాటు కానుంది.

వీటితో పాటు రక్షణ సిబ్బంది కోసం క్వార్టర్స్, క్రీడలు, వినోద సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. అలాగే నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి ప్రత్యేక ఇంజినీరింగ్ సదుపాయాలను కూడా ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తైతే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రవాణా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp