|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

AP DSC Notification : ఏపీలో త్వరలో మరో డీఎస్సీ.. అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు, అవసరమైన పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు.

2500కు పైగా పోస్టులతో ప్రకటన

త్వరలో రాబోతున్న ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,500కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా ఒక డీఎస్సీ ప్రకటన ఉంటుందని మంత్రి నారా లోకేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఇతర విద్యా విభాగాల్లోనూ పోస్టుల భర్తీ

కేవలం ఉపాధ్యాయ పోస్టులకే పరిమితం కాకుండా విద్యాశాఖ పరిధిలోని ఇతర విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డీఎస్సీతో పాటు డైట్, ఎన్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp