|  
● FLASH NEWS
Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  •  Banks: ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్!  •  CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం  • 
Skip to content

Excise: తెలంగాణలో 41 కొత్త బార్లకు నోటిఫికేషన్

telangana 41 new bars notification
telangana 41 new bars notification

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 బార్ల (2B Bars) ఏర్పాటుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు కొత్త బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో..

ఎక్సైజ్ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, ఈ 41 కొత్త బార్లలో అత్యధికంగా హైదరాబాద్ సిటీ పరిధిలోనే 14 బార్లకు అవకాశం కల్పించారు. అలాగే సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 10 కొత్త బార్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రీయర్ క్లియరెన్స్ కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఫీజులు, దరఖాస్తు చివరి తేదీ వివరాలు

ఈ కొత్త బార్లకు సంబంధించి బీఏటీ స్లాబ్‌ను రూ. 44 లక్షలుగా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కింద రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు అక్టోబర్ 12వ తేదీ వరకు తమ దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp