|  
● FLASH NEWS
BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  •  Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  • 
Skip to content

Flydubai: 174 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చార్?

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Captain Smit Machhar) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. సామాన్యుల నుంచి దేశాధినేతల దాకా ఆయన ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు.

వ్యాపార రంగం నుంచి విమానయానం వైపు

ముంబైలో పుట్టి పెరిగిన స్మిత్ మచ్చార్‌కు పైలట్ కావాలన్నది చిన్ననాటి కల కాదు. ఆయన కుటుంబం వస్త్ర వ్యాపారంలో ఉండటంతో, సహజంగానే ఆ వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవడానికి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేశారు. కానీ, 19 ఏళ్ల వయసులో ఓ సెమినార్‌కు హాజరుకావడం ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఆ సెమినార్ ద్వారా విమానయాన రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు.

న్యూజిలాండ్‌లో శిక్షణ, స్పైస్‌జెట్‌లో సుదీర్ఘ ప్రయాణం

పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్‌లోని ‘మెయిన్‌ల్యాండ్ ఎయిర్’ ఏవియేషన్ కాలేజీలో స్మిత్ చేరారు. శిక్షణ పూర్తయిన తర్వాత బోయింగ్ 737 విమానాన్ని నడిపారు. ఆయన మొదటి వాణిజ్య విమాన ప్రయాణం బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సాగింది. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2011 జూన్‌లో స్పైస్‌జెట్‌లో చేరిన ఆయన, అక్కడ 11 ఏళ్లకు పైగా పనిచేశారు. 2020 నవంబర్‌లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా పదోన్నతి పొంది, ఇతర పైలట్లకు స్వయంగా శిక్షణ ఇచ్చారు. బోయింగ్ 737 విమానాలను దాదాపు 9,750 గంటలు, స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా 6,400 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత 2022 జూన్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్ సంస్థలో చేరారు.

వృత్తి పట్ల నూటికి నూరు శాతం అంకితభావం

తన వృత్తి పట్ల స్మిత్ ఎప్పుడూ 100 శాతం అంకితభావంతో ఉంటారు. గత ఏడాది ‘బోనాఫైడ్ బాంటర్’ అనే పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను పంచుకుంటూ.. “పైలట్‌గా యూనిఫామ్ ధరించిన తర్వాత మనసులోకి వేరే ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడతాను” అని ఆయన పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనూ ప్రశాంతంగా పనిచేయగల శక్తి స్మిత్‌కు ఉందని మెయిన్‌ల్యాండ్ ఎయిర్ సంస్థ సీఈఓ ఫిలిప్ కీన్ ప్రశంసించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ అత్యవసరంగా ల్యాండ్ కావాల్సిన అవసరం ఏనాడూ రాలేదని గతంలో చెప్పిన స్మిత్.. ఇప్పుడు ఏకంగా 174 మంది ప్రాణాలు కాపాడి లోకం మెచ్చిన వీరుడిగా నిలిచారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp