|  
● FLASH NEWS
BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  •  Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  • 
Skip to content

Paradise: నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారు పురుగులు పట్టిపోతారు.. తమ్మారెడ్డి ఫైర్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) తాజాగా విడుదలైన ‘ప్యారడైజ్’ (Paradise Movie) సినిమాపై వస్తున్న నెగెటివ్ రివ్యూలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగా సినిమాపై విషప్రచారం చేస్తున్నారని, అలాంటి నెగెటివిటీని ప్రచారం చేసిన వాళ్లు పురుగులు పట్టిపోతారంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

సినిమా అనేది కొందరికి నచ్చవచ్చని, మరికొందరికి నచ్చకపోవచ్చని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ ‘ప్యారడైజ్’ చిత్రం విషయంలో మునుపెన్నడూ లేని విధంగా కావాలనే ఒక నెగెటివ్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని ఆయన మండిపడ్డారు. చాలా మంది రివ్యూవర్లు ఈ సినిమాకు కేవలం 1/5 రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.

వంద కోట్లు ఎలా వస్తాయి?

అంత దారుణమైన రేటింగ్స్ ఇచ్చేంత బాలేకపోతే, బాక్సాఫీస్ వద్ద సినిమాకు రూ. 100 కోట్ల కలెక్షన్లు ఎలా వస్తాయని ఆయన రివ్యూవర్లను ప్రశ్నించారు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తుంటే, కొందరు మాత్రమే పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp