|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Hanuman: ఆపదలో హనుమాన్ చాలీసానే ధైర్యాన్నిచ్చింది.. ప్రధానితో ఫ్లైదుబాయ్ పైలట్

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో దాడికి గురైన భారత సంతతికి చెందిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar).. భారత ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా విమానంలో జరిగిన భయానక ఘటనను, అప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని ఆయన ప్రధానితో పంచుకున్నారు.

తాను కష్ట సమయాల్లో ఎప్పుడూ ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) చదువుతానని, విమానంలో సహచర పైలట్ తనపై దాడి చేసిన సమయంలో కూడా తాను దానినే పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నానని స్మిత్ తెలిపారు. ఆ దేవుడే తనను రక్షించాడని ఆయన ఎమోషనల్ అయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా.. ధైర్యం చేసి కాక్‌‌పిట్ తలుపులు తెరవకపోతే 174 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారన్న ఆలోచన తనను ముందుకు నడిపించిందని స్మిత్ వివరించారు.

మీ నుంచి కాల్ రావడం గర్వంగా ఉంది

ప్రధాని మోదీతో మాట్లాడుతూ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “మీరు నా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్. మీ నుంచి ఇలా నాకు కాల్ రావడం చాలా గర్వంగా ఉంది. మీ ముందు ఏడుస్తున్నందుకు క్షమించండి సర్” అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. “భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కారని, ఇతరుల ప్రాణాలను రక్షించేవారని మీరు యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. మీ ధైర్యసాహసాలను చూసి దేశం గర్విస్తోంది. మీ ఆరోగ్యం కోసం యావత్ దేశం మహా మృత్యుంజయ జపం చేస్తూ ప్రార్థిస్తోంది” అని భరోసా ఇచ్చారు. అలాగే స్మిత్‌ తల్లిదండ్రులు, భార్యతో కూడా ప్రధాని మోదీ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. స్మిత్‌ను భగవద్గీత బోధనలతో పెంచిన ఆయన తల్లి గీతాబెన్‌ను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp