|  
● FLASH NEWS
EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  • 
Skip to content

Rajamouli: సింగీతం మృతిపై రాజమౌళి భావోద్వేగం

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారతీయ చలనచిత్ర దిగ్గజం, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) మృతి పట్ల అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి భావోద్వేగభరితమైన నివాళి అర్పించారు.

సినిమాకు హద్దులు లేవని నిరూపించారు

ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, భారీ బడ్జెట్లు లేని కాలంలోనే సింగీతం శ్రీనివాసరావు పెద్ద కలలు కన్నారని రాజమౌళి కొనియాడారు. డైలాగ్స్ లేకుండా మూవీ తీశారని, అలాగే ప్రేక్షకులతో టైమ్ ట్రావెలింగ్ చేయించారని ఆయన గుర్తుచేశారు. కామెడీ, ఫాంటసీ, హ్యూమన్ డ్రామా.. ఇలా జానర్ల మధ్య ఎలాంటి హద్దులు లేవని, సినిమాకు ఉన్న ఏకైక లిమిట్ కేవలం ‘ఇమాజినేషన్’ మాత్రమేనని ఆయన నిరూపించారని ప్రశంసించారు.

ఆయనకు రుణపడి ఉంటాం

సింగీతం శ్రీనివాసరావు లాంటి గొప్ప క్రియేటర్ చేసిన ప్రయోగాలు నేటి తరానికి ఆదర్శమని రాజమౌళి అభిప్రాయపడ్డారు. నాతో పాటు ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూత

94 ఏళ్ల వయసులో వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు.. అక్టోబర్ 3న చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించిన ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp