|  
● FLASH NEWS
Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  •  Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  • 
Skip to content

UNGA: ఐక్యరాజ్యసమితిలో అరకు ఎంపీ తనూజా రాణి ప్రసంగం

న్యూయార్క్, సూర్య న్యూస్ డెస్క్ : అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సెషన్ సమావేశాల్లో అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనూజా రాణి (Gumma Thanuja Rani) కీలక ప్రసంగం చేశారు. భారత పార్లమెంటరీ బృందం ప్రతినిధిగా వెళ్లిన ఆమె.. ఐరాస బడ్జెట్, సిబ్బంది, సభ్య దేశాల వాటా చెల్లింపులు చూసే ‘ఫిఫ్త్ కమిటీ’ (Fifth Committee) తొలి అధికారిక సమావేశంలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్’ అంశంపై భారత్ తరఫున మాట్లాడారు.

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఎజెండాను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని తనూజా రాణి ఇంగ్లీష్‌లో ప్రసంగించారు. సంస్థ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే సభ్య దేశాలు తమ ఆర్థిక వాటాను పూర్తిగా, గడువులోగా, ఎలాంటి షరతులు లేకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే, ‘UN80 ఇనిషియేటివ్’ ద్వారా డెవలప్‌మెంట్ పిల్లర్‌కు నిధులు పెంచాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రధానంగా నొక్కిచెప్పారు.

ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి వెళ్లిన 15 మంది ఎంపీల తొలి బ్యాచ్‌లో వైసీపీ నుంచి ఆమె ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అరకు నుంచి గెలుపొందిన యువ ఎంపీకి ఈ అంతర్జాతీయ వేదికపై మాట్లాడే అవకాశం దక్కింది. ఇదే సమావేశాల్లో బీజేపీ ఎంపీలు బన్షీలాల్ గుర్జార్ స్కేల్ ఆఫ్ అసెస్‌మెంట్స్‌పై హిందీలో మాట్లాడగా, సీపీ జోషి సెకండ్ కమిటీలో భారత్ తరఫున ప్రసంగించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp