
న్యూయార్క్, సూర్య న్యూస్ డెస్క్ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని (Kashmir Issue) లేవనెత్తారు. దక్షిణాసియాలో కశ్మీర్ సహా అన్ని వివాదాలను ఐక్యరాజ్యసమితి చార్టర్, తీర్మానాల పరిధిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
గతేడాది జరిగిన సాధారణ సభ సమావేశాల్లోనూ ఎర్డోగాన్ సరిగ్గా ఇలాంటి ప్రకటననే చేశారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకురావాలని పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు తుర్కియే మొదటి నుంచి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎర్డోగాన్ తాజా వ్యాఖ్యలపై దౌత్యపరంగా భారత్ మరోసారి దీటుగా బదులిచ్చే అవకాశం ఉంది.
మూడో పక్షం జోక్యం అనవసరం
కశ్మీర్ అంశంపై భారత్ తన వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూనే ఉంది. ఇది కేవలం రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని, ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని గతంలోనే తుర్కియేకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అనేది ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుందని, అంతర్గత విషయాల్లో వేరే దేశాలు జోక్యం చేసుకోవడాన్ని సహించబోమని ఐక్యరాజ్యసమితి వేదికగానే పలుమార్లు తేల్చిచెప్పింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



