|  
● FLASH NEWS
Harish Rao: బడుగు, బలహీన వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి  •  Sandalwood: కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు ఎంతంటే?  •  Judge: 5 నెలల్లో 23 మందికి ఉరిశిక్షలు.. సంచలన జడ్జి బదిలీ  •  Gouds: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుల నియామకం  •  BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  • 
Skip to content

Harish Rao: బడుగు, బలహీన వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ గౌడ్ (Suresh Goud), మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును (Harish Rao) మర్యాదపూర్వకంగా కలిశారు.

కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ నేత గుండాల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. గ్రేటర్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ గౌడ్‌ను ఈ సందర్భంగా హరీష్ రావు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాలని హరీష్ రావు సూచించారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన ఆశీర్వదించారు.

అనంతరం సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రరావు మార్గదర్శకత్వంలో సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నిజాంపేట్ డివిజన్ అధ్యక్షులు ఉప్పాల సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp