
ముంబై, సూర్య న్యూస్ : రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) షేర్ల లిస్టింగ్ కార్యక్రమం స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
వ్యాపారం చేయడం తనకు దైవపూజతో సమానమని అనంత్ అంబానీ వ్యాఖ్యానించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజ్‌లో బెల్ మోగించడం.. తనకు దేవుడి గుడిలో గంట కొట్టడం లాంటిదని ఆయన అభివర్ణించారు. ఈ ముఖ్యమైన వేడుకలో కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొని తమ కంపెనీ ప్రస్థానాన్ని, ఎదుగుదలను గుర్తుచేసుకున్నారు.
మరోవైపు తమ కంపెనీపై ఎంతో నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లకు ఈశా అంబానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ లిస్టింగ్ కార్యక్రమంతో అంబానీ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



