|  
● FLASH NEWS
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  •  Groundwater: తెలంగాణలో డేంజర్ బెల్స్.. 324 మండలాల్లో కరువు పరిస్థితులు  • 
Skip to content

10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!

ఢిల్లీ, సూర్య న్యూస్ : పదవ తరగతి (10th Class) చదువుతున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ సంబంధిత వర్గాలు ఓ భారీ ఊరటనిచ్చాయి. ఇకపై బోర్డు పరీక్షల్లో (Board Exams) మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ వంటి కఠినమైన ప్రధాన సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్ అయినా సరే.. విద్యార్థులు సులభంగా పాస్ అయ్యేలా ఓ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి.

లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ అమలులోకి రానుందని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

కొత్త విధానం ప్రకారం.. టెన్త్ విద్యార్థులకు 5 తప్పనిసరి సబ్జెక్టులతో పాటు ఆప్షనల్‌గా ఒక ‘స్కిల్ పేపర్’ ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు ప్రధాన సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే.. ఆ స్థానంలో ఈ స్కిల్ పేపర్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని వారు బోర్డు ఎగ్జామ్స్ క్లియర్ చేసినట్లుగా (పాస్) ప్రకటిస్తారు.

అయితే, ఈ సరికొత్త విధానం ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (నెక్స్ట్ బ్యాచ్) నుంచి మాత్రమే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అధికారికంగా వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp