|  
● FLASH NEWS
Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  •  YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  • 
Skip to content

Quthbullapur: కాలనీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా.. ఎమ్మెల్యే K P వివేకానంద్

హైదరాబాద్, సూర్య న్యూస్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు నూతన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను (MLA KP Vivekanand) మర్యాదపూర్వకంగా కలిశారు. కుత్బుల్లాపూర్‌లోని ఆయన నివాస కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

128వ చింతల్ డివిజన్ పరిధిలోని రంగానగర్, 130వ సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలకు చెందిన నూతన సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే వివేకానంద్ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీల అభివృద్ధిలో తమ, పర అనే బేధభావాలు లేకుండా అందరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారు. స్థానిక కాలనీల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మీ కాలనీ నూతన అధ్యక్షురాలు జి. అరుణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు, రంగా నగర్ నూతన అధ్యక్షులు లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి జంప శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, వివిధ కమిటీల ప్రతినిధులు సాగర్ రెడ్డి, రాములు యాదవ్, యాదగిరి యాదవ్, బాల చెన్నయ్య, నర్సింహులు, మధుకుమార్ యాదవ్, ఆంజనేయులు, మహేష్, కృష్ణా రావుతో పాటు పలువురు కాలనీ వాసులు హాజరయ్యారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp