
శ్రీనగర్, సూర్య న్యూస్ : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు (CM Omar Abdullah) సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర అసంతృప్తి ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో తమకు చోటు దక్కకపోవడంపై ఏకంగా 24 మంది నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరితో పాటు పలువురు మంత్రులతో తక్షణమే రాజీనామా చేయించాలని ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, తాము పార్టీకి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరినట్లు సమాచారం. జమ్మూ ప్రాంతానికి తగిన ప్రాధాన్యత దక్కలేదనే భావన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి తొలి సవాలుగా పరిణమించే అవకాశం ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



