
హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రాడ్యుయేట్ స్థాయి ఎన్‌టీపీసీ (NTPC) నోటిఫికేషన్ ద్వారా 3,548 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దరఖాస్తు ప్రక్రియకు నేటితో గడువు ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 (శుక్రవారం) చివరి తేదీ కావడంతో, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
డిగ్రీ అర్హతతో దరఖాస్తులు
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు కావడంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 56 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు
గడువు ముగియడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో చివరి నిమిషంలో సర్వర్ సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వెంటనే rrbapply.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



