రిపోర్టర్: Surya News

హైదరాబాద్, సూర్య న్యూస్ : విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కమల్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ.. "చాలా ఏళ్ల తర్వాత ఇటీవల మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. పాతరోజుల్లో లాగానే మనం కబుర్లు చెప్పుకున్నాం" అంటూ చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
24 క్రాఫ్ట్స్‌పై మీ అవగాహన అద్భుతం
కమల్ హాసన్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ.. "ఇప్పటికీ మీలో చిన్నపిల్లాడిలా నేర్చుకోవాలనే తపన కనిపించింది" అని చిరంజీవి ప్రశంసించారు. సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌పై కమల్‌కు ఉన్న అపారమైన అవగాహన, ఆసక్తి తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని మెగాస్టార్ కొనియాడారు. "మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి.. ప్రేమతో చిరంజీవి" అంటూ కమల్ హాసన్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



