
నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రత్యేక సర్వీసులు.. హైదరాబాద్లో 40 మందికి గ్రూప్ బుకింగ్
హైదరాబాద్, సూర్య న్యూస్ :
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణతో పాటు ఏపీ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ బస్సులను డిసెంబర్ 8, 2026 వరకు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని వేములవాడ, యాదాద్రి, కీసరగుట్ట, అనంతగిరి, ముచ్చింతల్ క్షేత్రాలతో పాటు.. ఏపీలోని శ్రీశైలం, సోమశిల, పంచారామాలు, తమిళనాడులోని అరుణాచలం, కర్ణాటకలోని హంపి వంటి పుణ్యక్షేత్రాలకు సైతం ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రాంతాలవారీగా ఈ బస్సులను నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గ్రూప్ బుకింగ్ సదుపాయం
కుటుంబ సమేతంగా లేదా బృందాలుగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో కనీసం 40 మంది భక్తులు ఒకేచోట ఉంటే, వారు నేరుగా ఒక బస్సునే అద్దెకు తీసుకునే విధంగా గ్రూప్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



