|  
● FLASH NEWS
Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  • 
Skip to content

Politics: పవన్ విడాకులపై నో కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో ఇదే కదా కావాల్సింది!

టీడీపీ, వైసీపీ శ్రేణులకు కఠిన ఆదేశాలు.. వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు వద్దు

అమరావతి, సూర్య న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు విమర్శల స్థాయి దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం పట్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. అటు అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ సైతం తమ పార్టీ శ్రేణులకు కఠిన ఆదేశాలు జారీ చేశాయి.

వైసీపీ అధికారిక ప్రకటన

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడాకుల వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వైసీపీ (YSRCP) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆయన వ్యక్తిగత విషయమని, దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ కూడా బహిరంగ విమర్శలు లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను షేర్ చేయవద్దని తమ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

టీడీపీ, ఐ-టీడీపీ హెచ్చరిక

మరోవైపు అధికార టీడీపీ (TDP) సైతం ఇదే తరహాలో స్పందించింది. మిత్రపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి విమర్శలు, కామెంట్స్ చేయవద్దని ఐ-టీడీపీ (iTDP) తమ సోషల్ మీడియా విభాగాలను హెచ్చరించింది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరించి వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఐ-టీడీపీ స్పష్టం చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp