|  
FLASH NEWS
India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  • 
Skip to content

Ambedkar Jayanti : నిజాంపేట్ సర్కిల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. అన్నదాన కార్యక్రమం

నిజాంపేట్, సూర్య న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత (Indian Constitution), భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) వేడుకలు నిజాంపేట్ సర్కిల్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. బిజెపి (BJP) నాయకులు గజ్జెల్లి సంతోష్, కాసాని సంతోష్ మరియు భార్గవి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి (Dr. S. Malla Reddy), జిల్లా ఇంచార్జ్ శెవ్వెల్ల మహేందర్, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన హక్కులు నేటికీ సమాజంలో మార్పునకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కేవలం నివాళులకే పరిమితం కాకుండా సామాజిక దృక్పథంతో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం (Annadanam) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చంద్రమౌళి, సుమన్ రావు, రచ్చ చక్రధర్, డాక్టర్ రాజు, పద్మ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp