
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు, అవసరమైన పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు.
2500కు పైగా పోస్టులతో ప్రకటన
త్వరలో రాబోతున్న ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,500కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా ఒక డీఎస్సీ ప్రకటన ఉంటుందని మంత్రి నారా లోకేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఇతర విద్యా విభాగాల్లోనూ పోస్టుల భర్తీ
కేవలం ఉపాధ్యాయ పోస్టులకే పరిమితం కాకుండా విద్యాశాఖ పరిధిలోని ఇతర విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డీఎస్సీతో పాటు డైట్, ఎన్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



