
హైదరాబాద్, సూర్య న్యూస్ : బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవిత డిమాండ్ చేశారు. బ్యాంకర్ల పనిభారం రోజురోజుకూ తీవ్రంగా మారుతోందని, వారి శ్రమను గుర్తించి తగిన వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లతో వ్యవహరించడం, బ్యాక్ ఎండ్ పనులు పూర్తి చేయడం, టార్గెట్లు చేరుకోవడం, కరెన్సీ లెక్కలు చూసుకోవడం వంటి వ్యవహారాలతోనే బ్యాంకర్లకు రోజంతా గడిచిపోతోందని ఆమె పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఉద్యోగులు రాత్రి 9 లేదా 10 గంటల వరకు కూడా ఆఫీసుల్లోనే పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీల వినియోగం భారీగా పెరిగినప్పటికీ, బ్యాంకు ఉద్యోగులపై పనిభారం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గుర్తుచేశారు. ఈ క్రమంలో బ్యాంకర్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 5 డేస్ వర్కింగ్ విధానాన్ని వెంటనే తీసుకురావాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



