|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

ఇస్నాపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ: భవ్య శ్రీ రామకథా వేడుకలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రామాలయంలో భవ్య శ్రీ రామకథ 2026 కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ ఆధ్యాత్మిక వేడుకకు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రామకథా ప్రవచనాలకు నియోజకవర్గంలోని భక్తులు వేలాదిగా తరలివచ్చి పునీతులవుతున్నారు

రామకథా విశిష్టతను వివరించిన గణేష్ మహారాజ్

వారణాసికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త పరమ పూజ్య శ్రీ గణేష్ మహారాజ్ ఈ సందర్భంగా రామకథ యొక్క ప్రాశస్త్యాన్ని భక్తులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు భగవంతుని నామస్మరణతో ఇస్నాపూర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు

భారీగా తరలివచ్చిన ప్రముఖులు మరియు భక్తులు

​ఈ వేడుకలో పటాన్‌చెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్.. సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి.. ఉత్తర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధులు సంజయ్ కుమార్ సింగ్.. సునీల్ కుమార్ సింగ్.. టింకు పటేల్.. రమేష్ యాదవ్.. ప్రిన్స్ సింగ్.. రాకేష్ చౌబే.. శ్యామ్ సుందర్.. గుప్తాజీ సంతోష్ సింగ్ పాల్గొన్నారు శ్రీ రామ సేవా సదన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సింగ్ సుమన్ ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp