
ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన’ (PM Kisan Maandhan Yojana). వృద్ధాప్యంలో అన్నదాతలకు ఆసరాగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ స్కీమ్ ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా కనీసం రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత అవకాశం లభిస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎవరు అర్హులు? ఎంత చెల్లించాలి?
ఈ పెన్షన్ పథకంలో చేరడానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు అర్హులు. అలాగే, దరఖాస్తు చేసుకునే రైతులకు 2 హెక్టార్ల లోపు సాగు భూమి మాత్రమే ఉండాలి. లబ్ధిదారుల వయసును బట్టి నెలకు కనీసం రూ.55 నుంచి గరిష్టంగా రూ.220 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రైతు ప్రతి నెలా ఎంత మొత్తాన్ని అయితే చెల్లిస్తారో, కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.
దరఖాస్తు విధానం.. కావాల్సిన డాక్యుమెంట్లు
రైతులు తమ 60 ఏళ్లు నిండిన తర్వాత నిరంతరాయంగా నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ పొందాలంటే ఈ పథకంలో సులభంగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, భూమి పాస్‌బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు (CSC) వెళ్లి గానీ, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://maandhan.in/ లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



