|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

రాష్ట్ర యువ కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు: అసభ్య వ్యాఖ్యల వ్యవహారంపై ఆగ్రహం

హైదరాబాద్, సూర్య న్యూస్: రాష్ట్ర యువ కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మహిళా ప్రజాప్రతినిధితో పాటు యాదవ, గౌడ సామాజిక వర్గాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

రాష్ట్ర కురుమ యువజన విభాగం అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్ నేతృత్వంలో కురుమ సంఘం ప్రతినిధులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రామయ్యకు ఫిర్యాదు సమర్పించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గాలను, మహిళా నాయకురాలిని కించపరిచేలా ప్రవర్తించడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను ఇప్పటికే పోలీసులకు సమర్పించామని, దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తామని తూముకుంట అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్, నవీన్ ముదిరాజ్, దుర్గా ప్రసాద్, ధనరాజ్ యాదవ్, అమరనాథ్ కురుమ, లింబారాజు, మనోజ్ యాదవ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp