దూలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
మల్లంపేట్‌లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సలీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీశైలం గౌడ్, పున్నారెడ్డి పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
వాసవి క్లబ్ మరియు నల్లమల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలకు కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్వాహకులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాఠశాలల బాధ్యత ఎంతో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సుభాష్ నగర్లో నూతన విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను వివరించారు.
నియోజకవర్గ సమస్యలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌కు పలువురు వినతి పత్రాలు అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని, ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి స్పష్టం చేశారు