|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

TG EdCET Admissions 2026: తెలంగాణ ఎడ్‌సెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. కాలేజీల్లో రిపోర్టింగ్‌కు డెడ్‌లైన్ ఇదే!

Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ (TG Ed.CET 2026) సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,965 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడతలో 15,009 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. వీరిలో మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మొత్తం 9,407 మంది అభ్యర్థులకు మొదటి విడతలో సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ప్రకటించారు.

TG EdCET సీట్లు పొందిన విద్యార్థులు చేయాల్సింది ఇదే

సీట్లు పొందిన అభ్యర్థులు నిర్దేశిత ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం వెబ్‌సైట్ నుంచి ఫీజు పేమెంట్ రసీదు మరియు జాయినింగ్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీటు అలాట్ అయిన విద్యార్థులు ఆగస్టు 20వ తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలలో స్వయంగా హాజరై రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. రిపోర్టింగ్ సమయంలో జాయినింగ్ రిపోర్ట్, ఫీజు రసీదుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను భౌతిక పరిశీలన కోసం సమర్పించాల్సి ఉంటుంది. కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తయిన తర్వాతే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ జారీ అవుతుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp