Skip to content

బొంతపల్లి వీరభద్రుని కళ్యాణంలో పాల్గొన్న కాటసాని సుధా శ్రీనివాస్ గౌడ్ దంపతులు : స్వామివారికి ప్రత్యేక పూజలు

బొంతపల్లి, సూర్య న్యూస్ : గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాటసాని శ్రీనివాస్ గౌడ్ మరియు వారి సతీమణి, సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటసాని సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో స్వాగతం అందుకున్న వీరు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణ వేడుకలో కాట దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భక్తుల అపార విశ్వాసం మరియు భాగస్వామ్యంతో బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బొంతపల్లి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp