|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

​ఆ దంపతుల పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్ : ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్, సూర్య న్యూస్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ మరియు ఆయన సతీమణి, నటి యామీ గౌతమ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ దంపతుల పతనం కోసం సినిమా పరిశ్రమలో చాలా మంది ఎదురుచూస్తున్నారంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

అసూయ పడుతున్నారు :

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘దురంధర్’ మూవీ ఘనవిజయం సాధించడం చాలా మందిని భయపెట్టిందని వర్మ విశ్లేషించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతినే మార్చేసిందని, మిగిలిన వారందరూ పునరాలోచించుకునేలా చేసిందని ఆయన ప్రశంసించారు. ఆదిత్య ధర్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఆయన పతనం కోరుకుంటున్నారని, అందుకే ఆ దంపతులు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని వర్మ సూచించారు.

దురంధర్-2 పై అంచనాలు :

ఆదిత్య ధర్ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలు తీస్తున్నారని ఆర్జీవీ కొనియాడారు. ఆయన మేకింగ్ స్టైల్ చూసి హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. కాగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘దురంధర్-2’ షూటింగ్ మే 19 నుండి ప్రారంభం కానుందని సమాచారం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp