|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Bank of Baroda : నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. డైరెక్ట్ జాబ్!

హైదరాబాద్, సూర్య న్యూస్: నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తీపి కబురు అందించింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (Wealth Management Services) విభాగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీల వివరాలు:

మొత్తం 104 పోస్టులలో ఏవీపీ (AVP) గ్రూప్ హెడ్ 04, ఏవీపీ టెరిటరీ హెడ్ 18, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (Senior Relationship Manager) 70, వెల్త్ స్ట్రాటజిస్ట్ (Wealth Strategist) 13 ఖాళీలు ఉన్నాయి.

​అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Degree) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి పీజీ (PG), మేనేజ్‌మెంట్, ఎన్ఐఎస్ఎం (NISM), ఐఆర్డీఏ (IRDA) సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ (Online) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 27న ప్రారంభం కాగా, ఏప్రిల్ 16వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ (OBC), ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు ఫీజు రూ. 850 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ. 175 గా ఉంది. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు www.bankofbaroda.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp