|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

IPL 2026 : కబ్బన్ పార్క్ లో పడిన బంతి.. చెన్నై పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం.

బెంగళూరు, సూర్య న్యూస్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో చెన్నై తడబడి పరాజయాన్ని మూటగట్టుకుంది.

​టాస్ ఓడి మొదట బ్యాటింగ్ (Batting) చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) 28 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) 29 బంతుల్లో 50 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ (Tim David) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు సాధించి చెన్నై బౌలర్లను (Bowlers) వణికించాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు రాబట్టిన డేవిడ్ 8 భారీ సిక్సర్లు (Sixes) బాదాడు. అందులో ఒక బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న కబ్బన్ పార్క్ లో పడింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ (All out) అయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) 7 పరుగులకే జాకబ్ డఫీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆయుష్ మాత్రే 1 పరుగు, సంజు శాంసన్ 9 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. సర్ఫరాజ్ ఖాన్ 50 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్టంప్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కార్తీక్ శర్మ 6 పరుగులు, శివమ్ దూబే 18 పరుగులు చేశారు. చివర్లో ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్ 37 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు కీలక వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించాడు. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సుయాష్ శర్మ కు ఒక వికెట్ దక్కింది. ఈ ఆల్ రౌండ్ షో తో బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp