|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Monalisa Case: సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

​న్యూఢిల్లీ/మహేశ్వర్, సూర్య న్యూస్: సోషల్ మీడియా సెన్సేషన్, ‘కుంభమేళా గర్ల్’గా గుర్తింపు పొందిన మోనాలిసా (Monalisa) దంపతులకు ఊహించని షాక్ తగిలింది. మైనర్‌ను పెళ్లి చేసుకున్నారన్న కారణంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ (Farman Khan) పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO Act) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు చెందిన మోనాలిసాకు సోషల్ మీడియా వేదికగా ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది మార్చి 11న తిరువనంతపురంలోని అరుమనూర్‌ ఆలయంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడకకు కేరళ మాజీ మంత్రి వి.శివన్‌ కుట్టితో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వెలుగులోకి వచ్చిన నకిలీ పత్రాల భాగోతం

వివాహం జరిగిన కొన్ని రోజులకే మోనాలిసా వయసుపై ఫిర్యాదులు రావడంతో ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్’ (NCST) రంగంలోకి దిగింది. కమిషన్ జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. మహేశ్వర్‌లోని హాస్పిటల్ రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించింది. అంటే పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.

నిబంధనల ఉల్లంఘన:

నకిలీ సర్టిఫికెట్లు: పెళ్లి కోసం ఈ దంపతులు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ (Fake Birth Certificate) తయారు చేయించినట్లు విచారణలో తేలింది.

అధికారుల తప్పుదోవ: ఆ నకిలీ పత్రంతోనే స్థానిక గ్రామ పంచాయతీలో తమ పెళ్లిని రిజిస్టర్ చేయించారు.

ఆలయ కమిటీ వివరణ: దంపతులు సమర్పించిన ఆధార్ కార్డుల ఆధారంగానే తాము వివాహం జరిపించామని ఆలయ పెద్దలు చెబుతున్నారు.

నేషనల్ కమిషన్ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మైనర్ వివాహం మరియు పత్రాల ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp