Skip to content

Bigg Boss Ashu Reddy : 9.5 కోట్ల మోసం కేసులో కొత్త ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి కృష్ణారెడ్డి

Hyderabad, Surya News: ఎన్ఆర్ఐ (NRI) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫేమ్ (Bigg Boss Fame) అషురెడ్డి (Ashu Reddy) వివాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 9.5 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై ఇప్పటికే అషురెడ్డి స్పందించి ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తాజాగా ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి (Venkata Krishna Reddy) ఈ వివాదంపై స్పందిస్తూ సంచలన విషయాలు బయటపెట్టారు.

తమకు 2021లో కాకినాడ నుంచి సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి ఫోన్ చేసి సంబంధం గురించి మాట్లాడారని ఆయన తెలిపారు. అబ్బాయికి ఒక ఫైనాన్స్ కంపెనీ (Finance Company) ఉందని వారు చెప్పారు. అయితే కాకినాడలో విచారించగా వారు డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తారని తెలిసింది. వారిపై కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయని సమాచారం అందింది. ఆ అబ్బాయికి అప్పటికే వివాహమై విడాకుల (Divorce) కేసు నడుస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయాలు తెలిసిన తర్వాత ఆ సంబంధాన్ని దూరం పెట్టాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

అయితే వారు మాత్రం ఏదో రకంగా తమను కలుపుకోవడానికి ప్రయత్నించారని తండ్రి వివరించారు. అషురెడ్డి తల్లి మాత్రం ఈ సంబంధం గురించి సానుకూలంగా ఆలోచించారు. కానీ ఆ కుర్రాడు తన భార్యతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు తర్వాత తెలిసింది. తన రెండో కూతురు దివ్యరెడ్డి (Divya Reddy) అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.

అషురెడ్డి చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఆమెకు ఈ ఆర్ధిక వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. కేవలం తల్లి ప్రోత్సాహం వల్లే ఆమె సినీ పరిశ్రమలోకి (Film Industry) అడుగుపెట్టింది. సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేకపోవడం వల్లే తాను తన భార్యకు దూరంగా ఉంటున్నట్లు వెంకట కృష్ణారెడ్డి వివరించారు. కూతురిది తప్పయితే తల్లిదే బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp