|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

రంజాన్ వేడుకలకు పటిష్ట భద్రత: చారిత్రక మక్కా మసీదును సందర్శించిన సీపీ సజ్జనర్

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ మంగళవారం చార్మినార్‌ వద్ద ఉన్న చారిత్రక మక్కా మసీదును సందర్శించారు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీతో కలిసి ఆయన మసీదు ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

భద్రతపై కీలక ఆదేశాలు:

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

రంజాన్ మాసంలో ప్రార్థనల కోసం వేల సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీల నిఘా మరియు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మత పెద్దలతో భేటీ:

అంతకుముందు, పురానీ హవేలీలోని కొత్వాల్ హౌస్‌లో ముస్లిం మత పెద్దలతో కమిషనర్ భేటీ అయ్యారు. నెల రోజుల పాటు కొనసాగే రంజాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎస్ఏం విజయ్ కుమార్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp