|  
● FLASH NEWS
Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం  •  ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  • 
Skip to content

Ashu Reddy : నా నెంబర్ లీక్ చేశారు.. నిమిషానికో కాల్ వస్తోంది.. అషు రెడ్డి ఆవేదన చూశారా?

హైదరాబాద్, సూర్య న్యూస్: బిగ్‌బాస్ (Bigg Boss) ఫేమ్, నటి అషు రెడ్డి (Ashu Reddy) రూ.9.5 కోట్ల వ్యవహారంలో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) లో ఉన్న తన మొబైల్ నంబర్‌ను (Mobile Number) కొన్ని న్యూస్ ఛానళ్లు నేరుగా ప్రసారం చేశాయని ఆమె ఆరోపించారు. దీనివల్ల తనకు ప్రతి నిమిషానికి ఒక మిస్డ్ కాల్ వస్తోందని ఆమె వాపోయారు. ఈ వరుస ఫోన్ కాల్స్ వేధింపులు తాను తట్టుకోలేకపోతున్నానని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వల్ల తాను ఎంతో మానసిక వేదన (Mental Agony) అనుభవిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా (Defamation Case) వేస్తానని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

గత కొద్దిరోజులుగా లండన్‌కు (London) చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై (NRI) నుండి అషు రెడ్డి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలపై అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు.

అషు రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పరువుకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని మీడియాను ఆదేశించింది. ఈ మేరకు అషు రెడ్డి కోర్టు ఆర్డర్ కాపీని షేర్ చేస్తూ తన ప్రైవసీని (Privacy) గౌరవించాలని కోరారు. అభ్యంతరకర పోస్టులను తొలగించాలని, అలాగే కొత్త వార్తలు పబ్లిష్ చేయకుండా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp