|  
FLASH NEWS
Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  • 
Skip to content

Vaibhav Suryavanshi : టెస్టుల్లోనూ టీ20 తరహాలో వీరబాదుడు.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన కుర్రాడి వీడియో వైరల్

ముంబై, సూర్య న్యూస్ : 15 ఏళ్ల వయసులోనే టీమిండియా (Team India) కు ఎంపికైన బీహార్ (Bihar) కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో టీ20 జట్టులోకి వచ్చిన అతడిని టెస్టుల్లోకి కూడా తీసుకోవాలని అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అతను ఆడిన ఒక అద్భుతమైన టెస్టు మ్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది.

2025 అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా అండర్-19 (Australia U-19) జట్టుతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన యూత్ టెస్టు మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ మ్యాచ్ లో కేవలం 78 బంతుల్లోనే అతడు సెంచరీ (Century) సాధించడం విశేషం. మొత్తం 86 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్ కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వైభవ్ వీరబాదుడుతో ఆ మ్యాచ్ లో భారత అండర్-19 జట్టు ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టెస్టుల్లోనూ టీ20 తరహా ఆటతో విరుచుకుపడే వైభవ్ ను సంప్రదాయ క్రికెట్ లోనూ ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే, ఐపీఎల్ (IPL) కు మరియు అంతర్జాతీయ మ్యాచ్ లకు చాలా తేడా ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదట టీ20 ఫార్మాట్ లో తనను తాను నిరూపించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ (Orange Cap) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన అతడు 237 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

​📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp