|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

Vaibhav Suryavanshi : రెచ్చగొడితే రచ్చే.. శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన 15 ఏళ్ల కుర్రాడు.. 29 బంతుల్లో 94 రన్స్

Hyderabad, Surya News: పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ (Sledging) చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక (Sri Lanka) బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది. మొన్నటి లీగ్ మ్యాచ్ లో జరిగిన గొడవ వైభవ్ సూర్యవంశీలో (Vaibhav Suryavanshi) ఎంత కసి పెంచిందో తాజా ఫైనల్ మ్యాచ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. గ్రౌండ్ లో తనను నోటికొచ్చినట్లు మాటలన్న లంక ఆటగాళ్లపై వైభవ్ తన బ్యాట్ తోనే రివెంజ్ (Revenge) తీర్చుకున్నాడు. ఈ దెబ్బతో భవిష్యత్తులో ఈ కుర్రాడిని గెలకాలి అంటేనే ప్రత్యర్థి టీమ్స్ భయపడేలా ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

అసలు ఇది 50 ఓవర్ల వన్డే మ్యాచ్ (ODI Match) నేనా లేక టీ10 లీగా అన్నట్లుగా వైభవ్ చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు (94 Runs) చేశాడంటే అతను ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. అందులో 10 ఫోర్లు (Fours), 8 భారీ సిక్సర్లు (Sixes) ఉన్నాయంటే బౌలర్లకు అస్సలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని క్లియర్ గా తెలుస్తోంది. ఆడిన ప్రతి షాట్ లోనూ మొన్నటి అవమానానికి బదులు తీర్చుకోవాలనే కోపం స్పష్టంగా కనిపించింది.

​ఈ దెబ్బతో లిస్ట్ ఏ క్రికెట్ (List A Cricket) చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (Fastest Half Century) కొట్టిన ప్లేయర్ గా వైభవ్ సంచలనం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే యాభై మార్క్ దాటేసి మైండ్ బ్లాక్ చేశాడు. వైభవ్ కొడుతున్న దెబ్బలకు స్కోరు బోర్డు (Score Board) రాకెట్ లా దూసుకెళ్లింది. లంక కెప్టెన్ ఎన్ని రకాలుగా ఫీల్డింగ్ మార్చినా, బౌలర్లను రొటేట్ చేసినా ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను మాత్రం ఏమాత్రం ఆపలేకపోయారు.

సెంచరీకి (Century) కేవలం ఆరు పరుగుల దూరంలో సహాన్ ఆరాచ్చిగే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి వైభవ్ పెవిలియన్ చేరాడు. వంద రన్స్ టార్గెట్ (Target) మిస్ చేసుకున్నాడు అనే బాధ ఫ్యాన్స్ లో ఉన్నా, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేశాడు. ఓపెనర్ ఆర్యతో (Arya) కలిసి తొలి వికెట్ కు కేవలం 8.5 ఓవర్లలోనే 132 పరుగులు జోడించడం మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసింది. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా సూర్యవంశీ ప్రతి బౌలర్ పై నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడి చేశాడు.

ఇటీవల ఇదే శ్రీలంక-ఏ జట్టుతో (Sri Lanka A Team) జరిగిన మరో మ్యాచ్ లో వైభవ్ త్వరగా అవుటయ్యాడు. ఆ మ్యాచ్ లో భారత్ (Team India) సూపర్ ఓవర్ లో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు వైభవ్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా ప్రవర్తించారు. దాంతో అతడు ఆగ్రహంతో వారి వైపు వెళ్లిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే అదే సంఘటన తర్వాత జరిగిన ఫైనల్ లో వైభవ్ తన బ్యాట్ తోనే సరైన సమాధానం చెప్పాడు. అండర్-19 (Under 19) ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై 80 బంతుల్లో 175 పరుగులు, ఐపీఎల్ (IPL) లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్ లలో వరుసగా 97, 96 పరుగులు చేసి సత్తా చాటిన ఈ కుర్రాడు భారత క్రికెట్ కు భవిష్యత్తు ఆశాకిరణంగా మారాడు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp