|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

India U19 Squad : రాహుల్ ద్రవిడ్ కుమారుడికి మళ్లీ అదృష్టం.. శ్రీలంక పర్యటనకు ఎంపికైన కుర్రాళ్లు వీరే

హైదరాబాద్, సూర్య న్యూస్: శ్రీలంక (Sri Lanka) పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును (India U-19 Team) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత యువ జట్టు వన్డేలు, యూత్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. యష్‌వర్ధన్ సింగ్ చౌహాన్ కు (Yashvardhan Singh Chouhan) ఈ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించే బాధ్యతలు దక్కాయి. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్ కోచ్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కు (Anvay Dravid) చోటు లభించింది.

పదహారేళ్ల అన్వయ్ ద్రవిడ్ వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. గత ఏడాది నవంబరులో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సిరీస్ లో భారత అండర్-19 ‘బి’ జట్టుకు అన్వయ్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సిరీస్ లో బెంగళూరు వేదికగా జరిగిన ఒకే ఒక మ్యాచ్ లో ఆడిన అతను తొలి బంతికే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ లో (Domestic Cricket) అతను కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు మళ్లీ అవకాశం కల్పించారు.

బీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ ఈసారి పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేసింది. గత అండర్-19 ప్రపంచకప్ (U-19 World Cup) గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా ఈ సిరీస్ కు తీసుకోలేదు. పూర్తిగా కొత్త ఆటగాళ్లతో భవిష్యత్తు కోసం జట్టును సన్నద్ధం చేసే దిశగా సెలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్ రౌండర్లకు పెద్దపీట వేశారు.

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జులై 4, 6, 9 తేదీల్లో హంబన్‌తోట వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత జులై 13 నుండి 16 వరకు గాలే వేదికగా మొదటి యూత్ టెస్ట్ జరుగుతుంది. జులై 20 నుండి 23 వరకు కొలంబో వేదికగా రెండో యూత్ టెస్ట్ జరగనుంది. వన్డే మరియు మల్టీ-డే ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. వన్డే జట్టులో అన్వయ్ ద్రవిడ్ కు అవకాశం రాగా, మల్టీ-డే జట్టులో మాత్రం అతనికి స్థానం దక్కలేదు.

📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ మరియు వివరణాత్మక కవరేజ్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp