Skip to content

Indian Passport Fee Hike : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు భారీ షాక్.. జూలై 1 నుంచి పెరిగిన ఫీజులు ఇవే

ఢిల్లీ, సూర్య న్యూస్:విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ (Passport) దరఖాస్తు రుసుములను విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs) భారీగా పెంచుతూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ కొత్త ఫీజులు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పాస్‌పోర్ట్ ఫీజులను ఈ స్థాయిలో పెంచడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కొత్త నిబంధనల ప్రకారం సాధారణ దరఖాస్తు (Normal Application) ఫీజుపై రూ. 1,000, తత్కాల్ దరఖాస్తుపై (Tatkal Application) రూ. 1,500 చొప్పున పెంచారు.

​36 పేజీల పాస్‌పోర్ట్ కొత్త ఫీజులు

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

కొత్త ఫీజుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే సామాన్యులకు భారం స్పష్టంగా తెలుస్తుంది. 36 పేజీల పాస్‌పోర్ట్ సాధారణ దరఖాస్తుకు ఇకపై రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు కేవలం రూ. 1,500 గా ఉండేది. ఇది సుమారు 66.66 శాతం పెంపుగా నమోదైంది. అలాగే తత్కాల్ (Tatkal) కింద దరఖాస్తు చేస్తే 36 పేజీల పాస్‌పోర్ట్ కు ఏకంగా రూ. 5,000 చెల్లించాలి. గతంలో ఈ ఫీజు రూ. 3,500 గా ఉండేది. ఇది 43 శాతం పెంపుగా ఉంది.

60 పేజీల (జంబో) పాస్‌పోర్ట్ కొత్త ఫీజులు

ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేసే వారి కోసం జంబో పాస్‌పోర్ట్ 60 పేజీల రుసుములను కూడా భారీగా పెంచారు. 60 పేజీల సాధారణ దరఖాస్తు (Normal Application) ఫీజు గతంలో రూ. 2,000 ఉండగా.. దానిని ఇప్పుడు రూ. 3,500 కు పెంచారు. అలాగే 60 పేజీల తత్కాల్ దరఖాస్తు (Tatkal Application) ఫీజు గతంలో రూ. 4,000 ఉండగా.. జూలై 1 నుంచి అది ఏకంగా రూ. 6,000 కు చేరింది. వీటితో పాటు వివిధ రకాల దరఖాస్తులపైన కూడా రుసుములు భారీగానే పెరిగాయి.

రాయితీ ఎవరికంటే?

అయితే దరఖాస్తుదారులలో కొందరికి ప్రభుత్వం చిన్న ఊరటనిచ్చింది. కొత్తగా పాస్‌పోర్ట్ కు దరఖాస్తు చేసుకునే 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు (Senior Citizens) ఫీజులో 10 శాతం రాయితీ కల్పించారు. అయితే ఈ 10 శాతం రాయితీ కేవలం ఫ్రెష్ పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లకు (Fresh Applications Only) మాత్రమే వర్తిస్తుంది. పాత పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ లేదా రెన్యూవల్ (Re-issue/Renewal) చేసుకునే వారికి ఈ రాయితీ వర్తించదు. ఈ కొత్త ఫీజులన్నీ జూలై 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

📲 Join WhatsApp