|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Palamuru University Guest Faculty Recruitment : పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా!

మహబూబ్‌నగర్, సూర్య న్యూస్: మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) అకడమిక్ ఇయర్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను గెస్ట్ ఫ్యాకల్టీ (Guest Faculty) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

వివరాలు ఇవే:

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా మరియు వివిధ పీజీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ (అవర్లీ బేసిస్) నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

అర్హతలు:​

ఇంజనీరింగ్ (CSE & Mathematics): బి.టెక్/ఎం.టెక్, మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/సెట్ అర్హత కలిగి ఉండాలి.

​​లా (Law): ఎల్.ఎల్.ఎం. డిగ్రీతో పాటు కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. నెట్/సెట్ లేదా పి.హెచ్.డి అర్హత తప్పనిసరి.

పీజీ కోర్సులు (M.Sc, M.A, MBA): సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/సెట్ లేదా పి.హెచ్.డి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నిర్దేశిత నమూనాలో దరఖాస్తులను పూర్తి చేయాలి. వాటితో పాటు సంబంధిత విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి నిర్ణీత సమయంలోగా సమర్పించాలి. వేతనం యూనివర్సిటీ నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp